- ముగ్గురికి జీవిత కారగార శిక్ష
- నిజామాబాద్ సెషన్స్ జడ్జి భారత లక్ష్మీ తీర్పు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాక్లూర్ వాసుల మర్దర్స్ కేసులో మరో రెండు హత్య కేసులలో ముగ్గురికి జీవిత కారగార శిక్ష విదిస్తూ నిజామాబాద్ సెషన్స్ జడ్జి జి. వి. ఎన్ భారత లక్ష్మీ మంగళవారం తీర్పులు వెలువరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేష్వర్ రెడ్డి తెలిపిన వివరాలు. మాక్లూర్ మండల కేంద్రంలోని ప్రసాద్, సాన్విక లను వేరువేరు ప్రదేశాలలో మెడిద ప్రశాంత్,గుగోలోత్ విష్ణు, మెడిద ఒడ్డెమ్మ లతో కలిసి హత్యలు చేసినట్లు నిర్ధారిస్తూ శిక్షలను ఖరారు చేశారు.మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదనపల్లి గ్రామ అటవీ ప్రాంతంలో 29 నవంబర్, 2023 న ప్రసాద్ ను ప్రశాంత్ బండరాయితో తలపై బలంగా కొట్టగా, విష్ణు కట్టేతో, వంశీ బీరు సీసాతో కొట్టి గాయపరచి హత్య చేసి భూమిలో పాతి పెట్టారు. నవీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రసాద్ భార్య సాన్విక ను కారులో తీసుకువెల్లి కారులోనే వంశీ సాన్వికపై దాడి చేయగా, విష్ణు తాడుతో మెడ చుట్టు ఉరి వేసి 01 డిశంబర్,2023 న హత్య చేశారు. రెండు హత్యలకు ఒడ్డెమ్మ సహకరించారు. పై నేరారోపణలు కోర్టు నేర న్యాయ విచారణలో రుజువు కావడంతో ప్రశాంత్, విష్ణు, ఒడ్డెమ్మ లకు హత్య నేరంకుగాను జీవితఖైదు,దోపిడీ నేరంకుగాను పది సంవత్సరాల జైలుశిక్ష, మోసం చేసినందుకుగాను ఏడు సంవత్సరాల జైలుశిక్ష లను విధించారు. శిక్షలన్నీ ఏకకాలంలో అనుభవించాలని సెషన్స్ జడ్జి భారత లక్ష్మీ తమ తీర్పులో పేర్కొన్నారు. మాక్లూర్ మర్దర్స్ గా పేరుగాంచిన హత్యలు ఒకే కుటుంబానికి చెందిన ప్రసాద్, సాన్విక, వారి కవల పిల్లలు చైత్రిక, చైత్రక్, ప్రసాద్ చెల్లెలు స్వప్న, శ్రావణి లు ఆరుగురిని హత్యలు చేసి, చేయించిన ప్రశాంత్ మరో రెండు హత్యకేసులలో నేర న్యాయ విచారణను ఎదుర్కొంటున్నాడు. ప్రసాద్ మైనర్ కూతురు చైత్రిక, కుమారుడు చైత్రిక్ ల హత్యకేసులలో ప్రశాంత్, ఒడ్డెమ్మ లకు జీవితఖైదుకు గురైన విషయం విధితమే.
