30.9 C
Hyderabad
Monday, August 3, 2026

బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ: కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు మంగళవారం రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ పార్టీ మండల ఇంచార్జ్ గాండ్ల మధు మాట్లాడుతూ.. కాళేశ్వరానికి సంబంధించిన కేసును రాష్ట్ర ప్రభుత్వం చేతగానితనంతో సిబిఐకి అప్పగిస్తుందని అన్నారు. అదేవిదంగా నిన్నటిదాకా సిబిఐ పైన వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఒక్కరోజులోనే మాట ఎందుకు మార్చాడని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును సీబీఐకి అప్పజెప్పడం వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. లేదంటేమున్ముందు ధర్నా కార్యక్రమాలు మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దౌర్ సాయిలు, సిరిగాది శేఖర్, రవి కిరణ్, గౌరాజి హనుమాన్లు, నిరడి సాయిలు, శంకరి వీరయ్య, నాయకులు, కార్యకర్తలు  తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article