26.3 C
Hyderabad
Monday, August 3, 2026

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహా ధర్నా

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, కోటగిరి : కెసిఆర్ పై వేసిన సిబిఐ ఎంక్వయిరీ నీ వెంటనే రద్దు చేయాలని  ఉమ్మడి కోటగిరి మండల టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో  అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు  మాజీ వైస్ ఎంపీపీ వల్లేపల్లి శ్రీనివాస్, తెల్ల రవికుమార్ మాట్లాడుతూ….  బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు  కోటి  ఎకరాలకు నీరు అందించే విధంగా కాళేశ్వరం  మేడిగడ్డ బ్యారేజ్ ను నిర్మించి తెలంగాణను సస్యశ్యామలం చేసిన ఘనత  దక్కించుకుందని అన్నారు. అది చూసి ఓర్వలేని  కాంగ్రెస్ పార్టీ నాయకులు మేడిగడ్డ బ్యారేజ్ లో రెండు పిల్లర్లు మాత్రమే కృంగిపోగా  మరమ్మత్తులు చేయించాల్సింది పోయి కాళేశ్వరం   ప్రాజెక్టులో అవినీతి అక్రమాలు జరిగాయి అంటూ కావాలానే నిందలు వేస్తూ సిబిఐ ఎంక్వయిరీ వేయడం సిగ్గుచేటని  ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సిబిఐ ఎంక్వయిరీ రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలలో వ్యతిరేకత మొదలైందని  రానున్న స్థానిక ఎన్నికలలో  కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేకుండా పోతాయని హెచ్చరించారు. అనంతరం కోటగిరి మండల కేంద్రం నుండి పొట్టంగల్ మండల కేంద్రం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ కోటగిరి పోతంగల్ మండలాధ్యక్షులు  సమీర్, సూదం నవీన్, మొరే కిషన్,శ్రీనివాస్ గౌడ్, ఫారూక్, కర్నె గజేందర్, చిన్న అరవింద్, గంగప్రసాద్ గౌడ్,గౌతమ్,కప్ప సంతోష్, మహేష్ రెడ్డి, మామిడి నవీన్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article