27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

వైద్య విద్యార్థులకు నాలుగేళ్ల స్థానికత తప్పనిసరి

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ : తెలంగాణలో వైద్య విద్య చదివే విద్యార్థులకు నాలుగేళ్ల స్థానికత తప్పనిసరని  సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోను సమర్థించింది. గతంలో తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి, డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు పక్కన పెడుతూ సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతత్వంలో సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. 9వ తరగతి 12 వ తరగతి వరకు తెలంగాణలో చదవాల్సిందేనన్న నిబంధనను అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది.

More articles

Latest article