28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని హత్య

Must read

📰 Generate e-Paper Clip

  • ఇద్దరి అరెస్ట్.. రిమాండ్ కు తరలింపు

 

సిర్పూర్, బతుకమ్మ : తమ అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని ఒకరిని హత్య చేసిన ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. సిర్పూర్ గ్రామానికి చెందిన రాములు, మాదాభాయ్ భార్యాభర్తలు. రాములు భార్య మాదాభాయ్ కు సిర్పూర్ గ్రామానికి చెందిన శంకర్ కు మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన రాములు తన భార్య మాదాభాయ్ ని పలుమార్లు హెచ్చరించారు. తమ అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని రాములు, మాదాభాయ్ కుట్ర పన్నారు. పథకం ప్రకారం ఈనెల 22న రాములుకు శంకర్ మద్యం తాగించి సాలూరా బ్రిడ్జీ వద్ద కత్తితో పొడిచి హత్య చేసి ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు బ్రిడ్జీపై నుంచి నీళ్లలో పడేశారు. శంకర్ అక్క ఎమ్మి లక్ష్మీబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచార చేసిన పోలీసులు రాములు, మాదాభాయ్ ను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి కత్తి, రెండు సెలఫోన్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు.  వారిని కోర్టులో హాజరు పరచి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.

More articles

Latest article