ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు కులాచారి దినేష్ కుమార్ జన్మదినం సందర్భంగా ఆదివారం ఎస్ఆర్ఆర్ పాలి క్లినిక్ లో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు లోలం సత్యనారాయణ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బిజెపి పార్టీ మండల అధ్యక్షులు,యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రక్త దానం చేయడం ఎంతో సంతోషంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు.రక్తదానం చేయడం వల్ల ప్రాణదాతలుగా మారే అవకాశం రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు,అనంతరం పార్టీ మండల అధ్యక్షులు లోలం సత్యనారాయణ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు కులాచారి దినేష్ కుమార్ జన్మదినం సందర్భంగా మండలంలో రక్తదాన శిబిరం నిర్వహించడం దీనికి యువకులు పెద్ద మొత్తంలో స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కుమార్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయురారోగ్యాలతో ఉండి రానున్న భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిరోహించాలని ఇందల్వాయి మండలం పార్టీ కార్యకర్తల ద్వారా, ప్రజల ద్వారా ఆకాంక్షిస్తున్నామన్నారు. గత వారం రోజులుగా భారీ పడడంతో ప్రజలు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్న పత్యంలో గండి తండా నిత్యవసర కిట్లను అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ స్వచ్ఛంద రక్తదాన శిబిరం సిబ్బంది, బిజెపి పార్టీ మండల అధ్యక్షులు లోలం సత్యనారాయణ,శ్రావణ్,మెండే అశోక్,తగత్ సింగ్, శ్రీను,అశోక్ జనార్ధన్,రాజేందర్,సురేందర్, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

