హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లోని గన్ పార్క్ వద్ద ఖాళీ యూరియా సంచులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శనివారం నిరసన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత తీర్చటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయ్యిదంటూ ఆందోళన చేశారు. యూరియా కొరత తీర్చి రైతులను ఆదుకోవాలని ప్లకార్డులను ప్రదర్శించారు. గణపతి బప్పా మోరియా.. కావాలయ్యా యూరియా అంటూ నినాదాలు చేశారు. రైతులకు వెంటనే యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
కాళేశ్వరంపై వేసింది పీసీ ఘోష్ కమిషన్ కాదు పీసీసీ కమిషన్
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాళేశ్వరంపై వేసింది పీసీ ఘోష్ కమిషన్ కాదు పీసీసీ కమిషన్ అని విమర్శించారు. తప్పుల తడకలాంటి కమిషన్ నివేదికపై మా వైఖరిని స్పష్టంగా తెలియజేస్తామన్నారు. ఎరువులు ఇవ్వకుండా కాంగ్రెస్ నేతలు బ్లాక్ మార్కెటింగ్, యూరియా మాఫియా చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న వ్యవసాయ సంక్షోభంపై మాట్లాడే అవకాశమివ్వాలని డిమాండ్ చేశారు.
