యూరియా కోసం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన
హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లోని గన్ పార్క్ వద్ద ఖాళీ యూరియా సంచులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శనివారం నిరసన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత తీర్చటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయ్యిదంటూ ఆందోళన చేశారు. యూరియా కొరత తీర్చి రైతులను ఆదుకోవాలని ప్లకార్డులను ప్రదర్శించారు. గణపతి బప్పా మోరియా.. కావాలయ్యా యూరియా అంటూ నినాదాలు చేశారు. రైతులకు వెంటనే యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంపై వేసింది పీసీ ఘోష్ కమిషన్ కాదు పీసీసీ కమిషన్ ఈ సందర్భంగా...