24.1 C
Hyderabad
Monday, August 3, 2026

ఇందల్వాయి బస్టాండ్ కు పేరేది..?

Must read

📰 Generate e-Paper Clip

ఇందల్వాయి, బతుకమ్మ : అందాల్ భాయ్ మండల కేంద్రంలోని ఇందల్వాయి బస్టాండ్ కు గత రెండు సంవత్సరాలుగా ఇప్పటివరకు పేరు లేకపోవడంతో  దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.డిపో మేనేజర్ స్పందించి తక్షణమే ప్రయాణ  ప్రాంగణానికి పేరు రాయించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు. నిత్యం  ప్రయాణికులు అధిక సంఖ్యలో ప్రయాణం కొనసాగిస్తుంటారు.ఇక్కడే రైల్వే స్టేషన్,బస్టాండు ఉండడంతో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి ప్రయాణించే ప్రయాణికులు ఇది ఏ ఊరు బస్టాండు అని అడగడంతో ఇబ్బందులు  ఎదుర్కోవలసి వస్తుంది.వెంటనే డిపో మేనేజర్ స్పందించి  ఇందాల్ భాయ్ బస్టాండ్ కు పేరు రాయించేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు ప్రజలు కోరుతున్నారు.

  • పట్టపగలు బస్టాండు పైన వెలుగుతున్న లైటు..

ఇందాక బై బస్టాండు పైన ఆవరణలో బస్టాండ్ పైన పట్టపగలు సైతం లైట్ వెలుగుతుండడంతో ప్రజలు వింతగా చూస్తున్నారు. కరెంటును పొదుపుగా వాడుకోవాలని నిబంధనలు ఉన్నప్పటికీ, సిబ్బంది పట్టించుకోకపోవడం పట్ల ప్రయాణికులు వాపోతున్నారు.

More articles

Latest article