ఇందల్వాయి బస్టాండ్ కు పేరేది..?

ఇందల్వాయి, బతుకమ్మ : అందాల్ భాయ్ మండల కేంద్రంలోని ఇందల్వాయి బస్టాండ్ కు గత రెండు సంవత్సరాలుగా ఇప్పటివరకు పేరు లేకపోవడంతో  దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.డిపో మేనేజర్ స్పందించి తక్షణమే ప్రయాణ  ప్రాంగణానికి పేరు రాయించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు. నిత్యం  ప్రయాణికులు అధిక సంఖ్యలో ప్రయాణం కొనసాగిస్తుంటారు.ఇక్కడే రైల్వే స్టేషన్,బస్టాండు ఉండడంతో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి ప్రయాణించే ప్రయాణికులు ఇది ఏ ఊరు బస్టాండు అని అడగడంతో...