- ఎకరా పంట నష్టానికి రూ.25లక్షల నష్ట పరిహారం అందించాలని డిమాండ్
- దెబ్బతిన్న రోడ్లు, కల్వట్లు, బ్రిడ్జ్ ల మరమ్మత్తులకు ప్రతిపాధనలు చేసి పంపండి
- అధికారులను ఆదేశించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
భీమ్ గల్, బతుకమ్మ : గత రెండు రోజులు కురిసిన భారీ వర్షాల కారణంగా కానిస్టేన్సీ లో దెబ్బతిన్న వరి, మొక్కజొన్న,సొయా పంటల అంచనాను అధికారులు పక్కాగా చేసి ప్రభుత్వానికి నివేదించాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలు, రోడ్లు, బ్రిడ్జ్ లు, కల్వర్ట్ లను ఆయన అధికారులు, నాయకులతో కలిసి శుక్రవారం పర్యటించి పరిశీలించారు. ఇందులో భాగంగా మోతె, భీమ్ గల్, రామన్నపేట్ వద్ద దెబ్బతిన్న బ్రిడ్జ్ లు, రోడ్లు, కల్వర్ట్ లతో పాటు పంటలను పరిశీలించారు. ఈ సందర్బంగా ఎక్కడెక్కడ ఏవిధంగా నష్టం జరిగింది. దానికి కావాల్సిన పనులు వాటి ప్రత్తిపాధనలను వెంటనే తయారు చేసి ప్రభుత్వానికి నివేదించాలని సంబంధిత శాఖల మంత్రులకు, ఉన్నంతధికారులకు తాను కలిసి వివరిస్తానని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగారూరల్ కానిస్టెన్సీలో పలు చెరువులు తెగిపోవడం కారణంగా కప్పల వాగు వరద ఉదృతి ఎక్కువవ్వడం కారణంగా దెబ్బతిన్న పంట వివరాలు పిలిమ్నరీ లెక్కల ప్రకారం 1165 ఎకరాల వరి, 95 ఎకరాల మొక్కజొన్న, 35 ఎకరాల సొయా పంట దెబ్బతిన్నట్లు స్థానిక వ్యవసాయ అధికారులు తెలిపారని అన్నారు. కానీ ఏ గ్రామం వెళ్లిన రైతులు అందరూ మా పంట పాడైంది, మా పంట పాడైందని అంటున్నారని,అందువల్ల మరొకసారి పంట నష్టాన్ని క్షేత్ర స్థాయిలో పూర్తి వివరాలు తెలుసుకొని అంచనా వేసి క్రాస్ చెక్ చేసుకొని ప్రభుత్వానికి అంచనా నివేదికను అందించాలని అధికారులకు సూచించారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటకు ఎకరానికి రూ. 25 వేల నష్ట పరిహారం ను అందించాలని ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేల్పూర్ రామన్న పేట దారిలో కల్వర్టు,రోడ్ దెబ్బతిందని, వేల్పూర్ మోతె మధ్యలో ఉన్న రోడ్ కల్వర్టు పూర్తి గా శిథిలావస్థకు చేరిందన్నారు.గతంలో నూతన కల్వర్టు కొరకు నిధులు మంజూరు కాగా ఈ ప్రభుత్వం నిలిపివేసిందని, మళ్ళీ ప్రభుత్వానికి కల్వర్టు నిర్మాణానికి అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించాలని అధికారులను ఆదేశించారు. ఆర్మూర్ భీమ్ గల్ మార్గంలో

కప్పలవాగు పై ఉన్న హై లెవల్ బ్రిడ్జ్ వరద ఉధృతికి ఒక బిట్ గడర్ పక్కకు జరిగిందని, దీని నష్ట అంచనాలు త్వరగా వేసి ప్రభుత్వానికి నివేదించాలి అని ఎస్.ఈ కి ఆయన సూచించారు. భీమ్ గల్,బడా భీంమ్ గల్ రోడ్డు పూర్తి స్థాయిలో దెబ్బ తినడంతో తాత్కాలిక మరమ్మత్తులు చేయాలని, రోడ్డు పునరుద్ధరించడానికి అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపాలని ఎమ్మెల్యే తెలిపారు. కమ్మర్ పల్లి, ఉప్లూర్ రోడ్ కోతకు గురి అయ్యిందని, దానికి తాత్కాలిక మరమ్మత్తులు చేయాలని అధికారులకు ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలో భారీ వర్షాల వల్ల ఆర్.అండ్ బి, పంచాయతి రాజ్, ఇరిగేషన్ శాఖలో జరిగిన నష్టాలను అంచనా వేసి ప్రభుత్వానికి పంపినట్లైతే తాను సంబంధిత మంత్రులకు నష్టం పై నివేదించి పనులు త్వరగా పూర్తి అయ్యేలా కృషి చేస్తానన్నారు. కప్పల వాగు వరద ఉధృతికి మోతె గ్రామనికి చెందిన నర్సారెడ్డి, మహేష్ రైతుల మొక్కజొన్న పంట 5 ఎకరాల్లో పూర్తిగా దెబ్బ తినడంతో వ్యవసాయ అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు.పంట నష్టాన్ని ప్రభుత్వానికి నివేదించాలని అధికారులను ఆదేశించారు. ప్రజాలేవరు ప్రవాహల వద్దకు వెళ్ళవద్దని, స్వీయ నియంత్రణ పాటించాలని ఆయన కోరారు. ఇంకా రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు ఎవరు వాగులు,చెరువులు,కుంటల వద్దకు వెళ్లవద్దని ఎమ్మెల్యే ప్రజలను కోరారు. వాగు పారుతుందని, చెరువులు ఆలుగు వెళ్ళిందని చూసి వద్దమని ఆత్రుత వద్దని అన్నారు. చిన్న పిల్లలను,ప్రజలను కరెంట్ స్థంబాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎవరు ఎన్ని చెప్పిన ఇలాంటి సమయంలో ప్రజలే స్వీయ నియంత్రణ పాటించాలని ప్రశాంత్ రెడ్డి ప్రజలను కోరారు.

