శ్రీరాం సాగర్ కు పోటేత్తిన వరద
మెండోరా,బతుకమ్మ :
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. మంజీరా, గోదావరి నధులు ఉగ్రరూపం దాల్చడంతో ఎస్సారెస్పీ ప్రాజెక్టు కు ప్రస్తుతం 4.30 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరద వలన ప్రాజెక్టు స్పిల్ వే వరద గేట్లు ఎత్తి గోదావరి నదిలోకి మొత్తం 5.5 లక్షల క్యూసెక్కుల వరకు నదిలో విడిచిపెట్టబోతున్నమని ప్రాజేక్టు సూపరింటెండింగ్ ఇంజనీర్ జగదీష్ తెలిపారు. ప్రాజెక్టు దిగువన గోదావరి నది పరిసర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే పశువుల కాపర్లు, గొర్రెల కాపరులు, చేపలు పట్టేవారు, రైతులు మరియు సామాన్య జనం గోదావరి నదిని దాటే ప్రయత్నం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రాజెక్టు 39 గేట్లు ఎత్తి 5,04,455 క్యూసెక్కుల నీటిని నదిలోకి వదులుతున్నారు. ప్లడ్ కెనాల్ ద్వారా 12,000, ఎస్కేప్ గేట్ల ద్వారా 8000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తంగా ప్రాజెక్టు నుంచి 5,25,322 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్టు అధికారులు తెలిపారు.

