జుక్కల్, బతుకమ్మ :
కౌలాస్ నాలా ప్రాజెక్టు 6 గేట్లు ఎత్తివేశామని ప్రాజెక్టు ఏఈ అశ్విని శర్మ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 458 మీటర్లు ఉందని ప్రాజెక్టు ఏఈ అశ్విని తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 457.35 మీటర్లు చేరుకుందన్నారు. ప్రాజెక్ట్ కు ఇన్ ఫ్లో 13828 క్యూసెక్కుల వచ్చి చేరుతుందని కౌలాస్ నాలా ప్రాజెక్టు లో 6 గేట్లు విడుదల చేశామని తెలిపారు. కౌలాస్ నాలా ప్రాజెక్టు నుంచి అవుట్ ఫ్లో 13828 క్యూసెక్కుల నీటిని ఔట్ ఫ్లో ఉందని తెలిపారు.
