- ఏడిఈ తోట రాజశేఖర్
పోతంగల్, బతుకమ్మ : గణేష్ మండపాల వద్ద ఇలాంటి విద్యుత్ సమస్యలు ఎదురైన గాని తమ దృష్టికి తీసుకురావాలని రుద్రూర్ ఏడిఈ తోట రాజశేఖర్ సూచించారు. భారీ వర్షాల కారణంగా పొతంగల్ హంగర్ గా మంజీరా నది బ్రిడ్జి వద్ద 33 కెవి లైన్, వరద ముంపునకు గురైన 186 ట్రాన్స్ఫార్మర్లను, లెవెన్ కె.వి లైన్లు, ఎల్టి లైన్లు పరిశీలించారు. ఈ సందర్భంగా పొతంగల్ గ్రామస్తులతో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గణేష్ మండపాల దగ్గర తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలియజేశారు. సర్వీస్ వైర్లు ఎలాంటి అతుకులు లేకుండా పండల్ వద్ద ఇనుప పోల్స్ కరెంట్ షాక్ రాకుండా వాటికి ఇన్సులేషన్ మె మెటీరియల్ చుట్టాలన్నారు. మండపాల వద్ద ఎత్తింగ్ చేసుకోవాలి తడి చేతులతో కరెంట్ పోల్స్ స్విచ్ బోర్డ్ లు తాకరాదు సిరీస్ లైట్లు మండపాల వద్ద పిల్లలకు అందనంత ఎత్తులో ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి గణేష్ మండలి వద్ద భద్రత ఫ్లెక్సీ మరియు మా స్థానిక లైన్మెన్ టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ వన్ టు ఏర్పాటు చేయాలి. గణేష్ నిమజ్జన శోభాయాత్రలో ఎక్కడ కూడా లైన్లకు కొండీలు వేయకూడదు. ఇది ప్రమాదం మీకు ఏ అవసరం ఉన్నా గానీ మా స్థానిక లైన్మెన్ ఏఈ 1912 కు తెలియజేయాలి. మీరు సొంతగా ఎలక్ట్రిసిటీ పనులు చేయకూడదు. ఈ కార్యక్రమంలో స్థానిక పోతంగల్ ఏఈ ఫక్రుద్దీన్ సిబ్బంది ఎల్ఐ మీరా, నారాయణ, ఎల్ ఎం శ్రీనివాస్ రెడ్డి, ఖదీర్ ,దినేష్, గణేష్, మనోహర్ &పోతంగల్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
