30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

నేడు కామారెడ్డికి మంత్రి సీతక్క రాక

Must read

📰 Generate e-Paper Clip

 

. . . మెదక్ జిల్లా లో వెంకట స్వామి

. . . వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన

హైదరాబాద్, బతుకమ్మ :

ఉత్తర తెలంగాణలో ప్రధానంగా కామారెడ్డి, మెదక్ జిల్లాలో కుండపోత వర్షాల నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉమ్మడి జిల్లాల ఇంచార్జి మంత్రులు పర్యటించనున్నారు. గురువారం కామారెడ్డి జిల్లాలో మంత్రి సీతక్క, మెదక్ జిల్లాలో గడ్డం వివేక్ లు లోతట్టు ప్రాంతాల ప్రజలకు యంత్రాంగం అందిస్తున్న పునరావస చర్యలను పరిశీలించి అధికారులతో సమీక్షించనున్నారు. మెదక్ జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తో కలిసి వివేక్ పర్యటనకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి మంత్రి సీతక్క పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ రివ్యూ చేస్తారని  తెలిసింది. ఇప్పటికి అధికారికంగా ఉత్తర్వులు రాలేదు. బారీ వర్షాల నేపథ్యంలో ఎరియల్ రివ్యూకు పరిస్థితులు అనుకూలంగా ఉండవని స్థానిక మంత్రులకు తోడు ఇంచార్జి మంత్రులు పర్యటన మాత్రం చేసి అధికారులతో సమీక్ష జరపనున్నారు.

 

Minister Seethakka to visit Kamareddy today

More articles

Latest article