హైదరాబాద్, బతుకమ్మ :
తెలంగాణ జిల్లాలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. రెండు రోజులుగా పలు జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. తొలుత 28న రెండు జిల్లాల్లో మాత్రమే స్కూళ్లకు సెలవులు ప్రకటించిన అధికారులు, గురువారం వాటిని 7 జిల్లాల విద్యాసంస్థలకు సెలవులను పెంచారు. గురువారం కామారెడ్డి , మెదక్ ,నిర్మల్ , ఆసిఫాబాద్ , నల్గొండ, ఆదిలాబాద్ , నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. ఈ మేరకు ఆయా జిల్లా కలెక్టర్ ల ఆదేశాల మేరకు డిఇఓలు ఉత్తర్వులు జారీ చేశారు.
