27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఇంటి గోడ కూలి పల్లె దవాఖాన వైద్యుడి దుర్మరణం

Must read

📰 Generate e-Paper Clip

 

 రాజంపేట, బతుకమ్మ :

బారీ వర్షం వల్ల చెరువు కట్ట తెగడం తో ఇంటికి వస్తున్న వాన నీటిని దారి మళ్లించేందుకు యువ వైద్యుడు చెస్తున్న ప్రయత్నంలో అతని ఇంటి గోడ కూలి అతడు దుర్మరణం చెందారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో జరిగింది. రాజంపేట మండల కేంద్రంలో బుధవారం ఉదయం రెండు చెరువు ల కట్టలు తెగిపోయాయి. దేవుడు చెరువు కట్ట తెగిపోవడంతో తన ఇంటి వద్ద వర్షపు నీరు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తుండగా వినయ్ కుమార్ (32) పై గోడ కూలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రాజంపేట మండలం గుండారం పల్లె దవఖాన వినయ్ కుమార్ డాక్టర్ గా పనిచేస్తున్నాడు. ఇటివలే వైధ్య విద్యాను పూర్తి చేసి వైద్యుడిగా సేవలందిస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటాడనుకుంటే మృత్యువు కబలించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

More articles

Latest article