29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

భారాసలో చేరిన రైతుబంధు జిల్లా మాజీ అధ్యక్షుడు అంజిరెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బాన్సువాడ : కామారెడ్డి జిల్లా రైతుబంధు  సమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు డాక్టర్ దుద్దాల అంజిరెడ్డి మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్​ఎస్​ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్​ మాట్లాడుతూ.. పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్​ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు. బీఆర్​ఎస్​ హయాంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని ఆయన స్పష్టం చేశారు. బాన్సువాడ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులపై చర్చించారు. మాజీ మంత్రితో పాటు పార్టీ సీనియర్ నాయకులు షేక్ జుబేర్, మోచి గణేష్, చందర్ తదితరులు ఉన్నారు.

More articles

Latest article