భారాసలో చేరిన రైతుబంధు జిల్లా మాజీ అధ్యక్షుడు అంజిరెడ్డి
బతుకమ్మ, బాన్సువాడ : కామారెడ్డి జిల్లా రైతుబంధు సమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు డాక్టర్ దుద్దాల అంజిరెడ్డి మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని ఆయన...