బతుకమ్మ, బోధన్: బోధన్ పట్టణం గోశాల ప్రాంగణంలో ఒక పిచ్చి కుక్క అకస్మాత్తుగా స్థానికులపై దాడి చేసి భయాందోళనలకు గురి చేసింది. ఆ కుక్క దాడిలో మహిళ చిన్న పిల్లలు సహా నలుగురికి గాయాలు కాగా, గాయపడిన వారిని తక్షణమే సమీప ఆసుపత్రికి తరలించారు. పట్టణ ప్రజలు ఈ ఘటనతో భయాందోళనకు గురై, అధికారులు తక్షణమే స్పందించి కుక్కను పట్టుకొని నివాస ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

