29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

విద్యుత్ షాక్ తో రైతు మృతి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, భిక్కనూరు : పొలం వద్ద ట్రాక్టర్ తో దున్నుతుండగా విద్యుత్ షాకు గురై రైతు మృతి చెందిన సంఘటన భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో ఆర్టిఏ చెక్ పోస్ట్ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు పోలీసులు వివరాల ప్రకారం కామారెడ్డి మండలం నరసన్నపల్లి గ్రామానికి చెందిన రాజిరెడ్డి( 45 ) జంగంపల్లి శివారులో  ఆశి రెడ్డికి చెందిన వ్యవసాయ పొలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. ఆదివారం వ్యవసాయ బావివద్ద ట్రాక్టర్ తో దున్నుతుండగా విద్యుత్ వైర్లకు ప్రమాదవశాత్తు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు,ఇరు గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకొని రోదించారు. ఈ విషం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Farmer dies of electric shock

More articles

Latest article