విద్యుత్ షాక్ తో రైతు మృతి

బతుకమ్మ, భిక్కనూరు : పొలం వద్ద ట్రాక్టర్ తో దున్నుతుండగా విద్యుత్ షాకు గురై రైతు మృతి చెందిన సంఘటన భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో ఆర్టిఏ చెక్ పోస్ట్ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు పోలీసులు వివరాల ప్రకారం కామారెడ్డి మండలం నరసన్నపల్లి గ్రామానికి చెందిన రాజిరెడ్డి( 45 ) జంగంపల్లి శివారులో  ఆశి రెడ్డికి చెందిన వ్యవసాయ పొలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. ఆదివారం వ్యవసాయ బావివద్ద ట్రాక్టర్ తో దున్నుతుండగా విద్యుత్ వైర్లకు ప్రమాదవశాత్తు తగలడంతో అక్కడికక్కడే మృతి...