26.3 C
Hyderabad
Monday, August 3, 2026

పెన్షన్లు పెంచకుంటే తాడోపేడో తేల్చుకుంటాం

Must read

📰 Generate e-Paper Clip

  • కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుపడ్డ మందకృష్ణ మాదిగ

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :  ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వికలాంగులకు చేయూత పెన్షన్ దారులకు పెన్షన్లు పెంచే వరకు ప్రభుత్వంపై తాడోపేడో తేల్చుకుంటామని పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ అన్నారు. శనివారం ఎల్లారెడ్డి పట్టణంలోని బాలగోడు ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన వికలాంగుల మహా గర్జన సన్నాహక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు వికలాంగులకు 6000 చేయుట పెన్షన్ దారులకు 4000 రూపాయలు పెంచే వరకు ఉద్యమము ఆగదని సెప్టెంబర్ 9న హైదరాబాదులో తలపెట్టనున్న మహా గర్జన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నియంతల ప్రవర్తిస్తుందని వికలాంగుల పట్ల చిన్నచూపు చూస్తుందని 9వ తేదీ లోపు నిర్లక్ష్య వైఖరి మార్చుకోకుంటే వికలాంగులతో పాటు వృద్ధులు వితంతువులు చేయుట పెన్షన్ దారులతో పాటు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహాగర్జన నిర్వహిస్తున్నామన్నారు. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పెంచుకుంటే ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకున్న రోజులు దగ్గర ఉన్నాయని ఇక మరో ఉద్యమం తప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశి, ఎంఆర్పిఎస్ నాయకులు కంతి పద్మారావు, కుంటోళ్ల యాదయ్య, శివానందం, తొంటా సాయిలు, సురేందర్, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article