- నిలిచిపోయిన పనులను పూర్తి చేసి, అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని వినతి
భీమ్ గల్, బతుకమ్మ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను భీమ్ గల్ మండల కాంగ్రెస్ నాయకులు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లోని ఆయన స్వగృహం లో కలిసి పూల బొకే నిచ్చి, శాలువాతో సన్మానించారు. భీమ్ గల్ నిలిచి పోయిన 100 పడకల ఆసుపత్రి, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ లకు నిధులను కేటాయించి పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరారు. అంతే కాకుండా తహసీల్దార్ ఆఫీస్, అగ్రికల్చర్ ఆఫీస్, ఎం ఈ ఓ ఆఫీస్, ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్, డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ లతో పాటుగా నూతనంగా శాంక్షన్ అయిన కోర్టు భవనాల నిర్మాణంనకు నిధులు మంజూరు చెయ్యాలని కోరారు. వీటితో పాటు మండలంలోని ముచ్కూర్ సొసైటీ భవన నిర్మాణం తో పాటు రహత్ నగర్ లో గోదాముల నిర్మాణం కు నిధులు మంజూరు చేయాలని కోరారు. దాంతో స్పందించిన మహేష్ గౌడ్ సంబంధిత ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహా, అగ్రికల్చర్ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఆర్ అండ్ బి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలతో ఫోన్లో మాట్లాడారు. పీసీసీ ప్రెసిడెంట్ ఫోన్ తో స్పందించిన మంత్రులు అభివృద్ధి పనులకు నిధుల మంజూరి ఇస్తామని తెలపడం తో భీమ్ గల్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మహేష్ కుమార్ గౌడ్ ను కలిసిన వారిలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు బొదిరి స్వామి, పట్టణ అధ్యక్షులు జేజే నరసయ్య మాజీ ఎంపీపీ కన్నె సురేందర్,జిల్లా ప్రధాన కార్యదర్శి కుంట రమేష్, కార్యదర్శి భోజ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లెల లక్ష్మణ్,ముచ్కర్ సొసైటీ చైర్మన్ బంగ్లా దేవేందర్, పిట్ల శీను,రావుల మోహన్,ఏ ఎం సీ డైరెక్టర్ జీవన్, భీంగల్ విలేజ్ కమిటీ అధ్యక్షులు నీలం రవి,సిహెచ్ రాకేష్,శ్రీధర్ గౌడ్,ఎస్పీ రత్నం, పల్లె శేఖర్,కొరడి లింబాద్రి,బీసీ అధ్యక్షులు రాజు,నల్లూరి శ్రీను, భూమేష్ తదితరులు పాల్గొన్నారు.

