భీమ్ గల్, బతుకమ్మ : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భీమ్ గల్ ఖండ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నేడు నిర్వహిస్తున్నట్లు ఖండ కార్యావాహా మంచె గణేష్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమ్మేళనాన్ని మండల కేంద్రంలోని ఎల్. జె ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 10 నుండి నిర్వహించనున్న ఈ సమ్మేళనానికి కార్యకర్తలు 10 నిమిషాలు ముందు హాజరు కాగలరని ఆయన కోరారు.
