29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

ఆల్ ఇండియా బంజారా సేవ్ సంఘ్ కార్యవర్గం ఎన్నిక

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : ఆల్ ఇండియా బంజారా సేవ్ సంగ్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా యువజన అధ్యక్షులుగా శంకర్ నాయక్ , జనరల్ సెక్రెటరీ రవి నాయక్, కోశాధికారిగా లస్కర్ నాయక్ వీరితోపాటు జిల్లా పూర్తిస్థాయి బాడీ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా బంజారా సేవ సాంగ్ జిల్లా అధ్యక్షులు సురేందర్ మాట్లాడుతూ ఆల్ ఇండియా బంజారా సేవ్ సాంగ్ జిల్లా యువజన అధ్యక్షులుగా శంకర్ నాయక్, జనరల్ సెక్రెటరీ రవి నాయక్, కోశాధికారి లస్కర్ నాయక్ వీరితోపాటు జిల్లా పూర్తిస్థాయి బాడీనీ డివిజన్ స్థాయి బాడిని వివిధ మండలాల అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. ఆల్ ఇండియా బంజారా సేవ్ సంగ్ ఆధ్వర్యంలో అనేక సేవలు చేయడం జరుగుతుందని, ఆల్ ఇండియా బంజారా సేవా సంగ్ ఎవరికి ఏ ఆపద వచ్చినా వెంటనే వెళ్లాలనే ఉద్దేశంతో జిల్లా యువజన సంగ్ పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రెడ్డి నాయక్, డివిజన్ అధ్యక్షులు సదర్ నాయక్,ఉపాధ్యక్షులు లింబాద్రి రామారెడ్డి మండల అధ్యక్షులు రామ్ చందర్ నాయక్, విట్టల్ నాయక్ సంఘ సభ్యులు పాల్గొన్నారు.

More articles

Latest article