26.6 C
Hyderabad
Monday, August 3, 2026

శ్రామిక విముక్తి పోరాటమే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం

Must read

📰 Generate e-Paper Clip

. . . సెప్టెంబర్ 17 ముమ్మాటికి విద్రోహ దినమే

. . . సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ సెక్రటరియట్ సభ్యులు వి.ప్రభాకర్

బతుకమ్మ, సిరికొండ : భూమి, భుక్తి కోసం జరిగిన మహాత్తరమైన శ్రామిక విముక్తి పోరాటమే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అని సెప్టెంబర్ 17 అన్నది ముమ్మాటికి విద్రోహ దినమేనని, చరిత్రను వక్రీకరించడమే మతవాదుల, పాలకుల ఎత్తుగడని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ సెక్రటరియట్ సభ్యులు వి.ప్రభాకర్ స్పష్టం చేశారు. సిరికొండ మండల కేంద్రంలోని కామాదేను కళాశాలలోమంగళవారం నిర్వహించిన సెప్టెంబర్ 17 విద్రోహ దినం వారోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు . ఇందులో భాగంగా సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ అర్ముర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్. రమేష్ అధ్యక్షతన జరిగిన సభ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 1946 నుంచి 1951 వరకు జరిగిందని, ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 3000 గ్రామాలు విముక్తి చేసి పది లక్షల ఎకరాల భూమిని కమ్యూనిస్టు ఆధ్వర్యంలో పంచడం జరిగిందన్నారు . ఈ పోరాటంలో 4,000 మంది అమరవీరులైనారని .తొలి అమరవీరుడు కామ్రేడ్ దొడ్డి కొమరయ్య భూమి కోసం భుక్తి కోసం ఈ దేశ విముక్తి కోసం పోరాడారన్నారు. చరిత్రను మరచిన బిజెపి, కాంగ్రెస్, టీఆర్ఎస్ అమరవీరుల త్యాగాలను పోరాటాలను పక్కదోవ పట్టిస్తూ విలీనమని విమోచన అని ఈరోజు తన పోరాడిన పోరాటాలను పాలకులు ఈరోజు వక్రీకరిస్తున్నారన్నారు. సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పిట్ల రామకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతంగా పోరాటంను హిందూ, ముస్లిం ల మధ్య జరిగిన ఘర్షణలుగా మతశక్తులు చరిత్రను వక్రీకరించి విషప్రచారం చేస్తున్నారన్నారు. విలీనమో, విమోచనమో అని చరిత్రను వక్రీకరిస్తే తగిన బుద్ధిచెబుతామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మాస్ లైన్ డివిజన్ నాయకులు ,ఆర్. దామోదర్, బి.బాబన్న, రమేష్,జి.సాయరెడ్డి,ఎం. డి అనిస్, బి.కిషోర్,కె.అశీష్ ,జె. బాల్ రెడ్డి , జె. ఎర్రన్న,ఎస్. కిషోర్,బి.కిషన్,గ్యామ గంగారాం, జి.భూమేష్,తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article