బతుకమ్మ, బోధన్: బోధన్ పట్టణం పోస్ట్ ఆఫీస్ పెద్ద బజారు రోడ్‌లో గల శ్రీ నగరేశ్వరలో శ్రీ వాసవీకన్యకా పరమేశ్వరీ ఆలయ ద్వితీయ వార్షికోత్సవం శ్రావణ బహుళ ఏకాదశి మంగళవారం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఉదయం నుండే భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి సేవలో నిమగ్నమయ్యారు. ఉత్సవంలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకం, లలితా సహస్రనామ పారాయణం, కుంకుమార్చన వంటి పూజా కార్యక్రమాలు జరిగాయి. భక్తులు అమ్మవారికి ఓడిబియ్యం సమర్పించగా, అనంతరం అన్నప్రసాదం వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, డీ.యోగేష్, ఆలయ కమిటీ అధ్యక్షులు గంజి వేంకటేశం, గౌరవాధ్యక్షులు కొత్త రాజేశ్వర్, కార్యదర్శి కంటాల రమేశ్, కోశాధికారి పబ్బ మురళి, గంగం కిరణ్ కుమార్, మాశెట్టి వెంకన్న, మాటూరి నాగదుర్గ, ముత్యాల నాగనాథ్, మాశెట్టి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

