29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎల్లారెడ్డిపేటలో సన్ సోలార్ ఏజెన్సీ ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

  • గ్రామీణ ప్రజలకు అందుబాటులో ధరలు
  • నిర్వాహకులు చందుపట్ల లక్ష్మారెడ్డి, నంది నరేష్.

 

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: గ్రామీణ ప్రాంత ప్రజలు సన్ సోలార్ సేవలు ఉపయోగించుకోవాలని సన్ సోలార్ నిర్వాహకులు చందుపట్ల లక్ష్మారెడ్డి,నంది నరేష్ లు అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సన్ సోలార్ ఏజెన్సీని సోమవారం సెస్ ఏఈ పృథ్వి, ఐఓబి బ్యాంక్ మేనేజర్ విజయ్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సన్ సోలార్ ఏజెన్సీ యజమానులకు చందుపట్ల లక్ష్మారెడ్డి, నంది నరేష్ లకు చరవాణి ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు సన్ సోలార్ సేవలు ఎంతో ఉపయోగపడతాయని ఈ సందర్భంగా వారు అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, వివిధ వ్యాపారవేత్తలు, కాంగ్రెస్, బిఆర్ఎస్,బిజెపి,వివిధ రాజకీయ పార్టీ నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Sun Solar Agency launched in Yella Reddypet

More articles

Latest article