బతుకమ్మ, బిచ్కుంద : జుక్కల్ నియోజకవర్గం ను అతలాకుతలం చేసిన వరద బీభత్సంలోనూ ప్రజలతో మమేకం అయ్యారు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు. ఆయా ప్రాంతాలను వరదలు ముంచెత్తడంతో ప్రజలకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ఆదివారం రాత్రి నుండి జల దిగ్భంధనంలో చిక్కుకున్న జుక్కల్ నియోజకవర్గం లో విస్తృతంగా పర్యటించారు. ఓ వైపున పరవళ్లు తొక్కుతున్న మంజీరా చప్పుళ్లు.. మరో వైపున జనవాసాల్లోకి చొచ్చుకుని వస్తున్న వరద నీటిలోనూ పర్యటించి భేష్ అనిపించుకున్నారు. బిచ్కుంద మండలంలోని షెట్లుర్ గ్రామం తో పాటు మంజీరా పరివాహక గ్రామాలన్ని జలదిగ్భందనంలో కొట్టుమిట్టాడుతున్నాయి. గ్రామాల లోని వివిధ వీధుల గుండా స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ముంపునకు గురైన ప్రాంతాల్లో తిరుగూ

బాధితులకు భరోసా కల్పించారు. అలాగే షెట్లూర్ గ్రామంలో నాటు పడవలో తిరిగిన ఆయ వరదలతో అతలాకుతలం అయిన ఆరుగురిని సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చారు. వరద పోటెత్తిన ప్రతి గ్రామంలోని వారిని పునరావాస కేంద్రాలకు తీసుకెళ్లేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జుక్కల్ నియోజకవర్గంలో జలమయం అయిన అన్ని గ్రామాల్లో సోమవారం ఉదయం నుండి అన్ని గ్రామాలను పర్యవేక్షిస్తూ ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించే పనిలో నిమగ్నం అయ్యారు. వరదల్లో చిక్కుకున్న ఆరు మందిని బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియలో తోట లక్ష్మీ కాంతారావు స్వయంగా పాల్గొన్నారు. మంజీరాలో చిక్కుకున్న ఆరుగురిని కాపాడేందుకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తో చర్చించి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రప్పించి వారిని కాపాడడంలో తనవంతు బాధ్యత నిర్వర్తించారు. ఇంతటి బాధ్యత కలిగిన ఎమ్మెల్యేను మొదటిసారి జుక్కల్ నియోజకవర్గం లో చూస్తున్నామని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

