నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే తోట

బతుకమ్మ, బిచ్కుంద :  జుక్కల్ నియోజకవర్గం ను  అతలాకుతలం చేసిన వరద బీభత్సంలోనూ ప్రజలతో మమేకం అయ్యారు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు.  ఆయా ప్రాంతాలను వరదలు ముంచెత్తడంతో ప్రజలకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ఆదివారం రాత్రి  నుండి జల దిగ్భంధనంలో చిక్కుకున్న జుక్కల్ నియోజకవర్గం  లో విస్తృతంగా పర్యటించారు. ఓ వైపున పరవళ్లు తొక్కుతున్న మంజీరా చప్పుళ్లు.. మరో వైపున జనవాసాల్లోకి చొచ్చుకుని వస్తున్న వరద నీటిలోనూ పర్యటించి భేష్ అనిపించుకున్నారు. బిచ్కుంద మండలంలోని షెట్లుర్ గ్రామం తో పాటు మంజీరా...