29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఏర్గట్ల పాఠశాల విద్యార్థులకు జాతీయ స్థాయి కవితల పోటీలలో బహుమతులు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,  ఏర్గట్ల :  వురిమెళ్ళ ఫౌండేషన్ ఖమ్మం వారి ఆధ్వర్యంలో జాతీయస్థాయి లో పాఠశాల విద్యార్థులకు కథలు, కవితా పోటీలు నిర్వహించారు. ఉభయ రాష్ట్రాల నుండి సుమారు 400కు పైగా కథలు, కవితలు రావడం జరిగింది. అందులో నుంచి 20 కథలకు, కవితలకు బహుమతులు ప్రకటించారు. దీనిలో భాగంగా ఏర్గట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని నూనె శ్రీనిధి,రాసిన మంచి మనసు అనే కథకు జాతీయస్థాయిలో బహుమతి, కె అభిలాష్,రాసిన ప్రకృతి అనే కవితకు జాతీయస్థాయిలో బహుమతి లభించిందని ఏర్గట్ల పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు ప్రవీణ్ శర్మ తెలిపారు.బహుమతులు గెలుపొందిన విద్యార్థులకు ఈనెల 24వ తేదీన ఖమ్మంలో జరిగే బహుమతుల ప్రధానోత్సవం లో విద్యార్థులకు అందజేస్తారని తెలిపారు. జాతీయస్థాయిలో ఏర్గట్ల విద్యార్థులు బహుమతులు సాధించడం పట్ల  పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు  కొమరగిరి కృష్ణచారి,ఎంతో సంతోషంతో విద్యార్థులను అభినందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రాజనర్సయ్య,ప్రసాద్,నరేష్, ట్వింకిల్,గంగా మోహన్, రాజశేఖర్,సమత,జ్యోతి పాల్గొన్నారు.

More articles

Latest article