23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

స్పా సెంటర్లపై పోలీసుల దాడులు

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : ఎల్బీనగర్ నియోజకవర్గంలోని చైతన్యపూరి ప్రాంతంలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఎనిమిది స్పా సెంటర్లపై చైతన్యపురి పోలీసులు శనివారం రాత్రి ఏకకాలంలో దాడులు నిర్వహించి ఆ కేంద్రాల్లో పని చేస్తున్నo సిబ్బంది, థెరపిస్టులతో పాటు కస్టమర్లను సైతం అదుపులోకి తీసుకొని కేసులు నమోదు సంచలనంగా మారింది. నూతనంగా చైతన్యపూరి సీఐ గా బాధ్యతలు చేపట్టిన కే.సైదులు స్ప సెంటర్ల పై గట్టి నిఘా పెట్టడం ఆ కేంద్రాల నిర్వాహకులకు ఒక సవాలుగా మారిందని వాదనలు వినిపిస్తున్నాయి. ఆర్కే పురం డివిజన్ లోని,వాసవీ కాలనీ,  మోజో వెల్నెస్ స్పా, విక్టోరియా మెట్రో స్టేషన్ సమీపంలోని స్కె బ్యూటీ అండ్ స్పా, న్యూనాగోల్ ప్రభాత్ నగర్ లోని ఏ పీస్ ఫుల్ ఫ్యామిలీ సెలూన్ అండ్ స్పా, చైతన్యపురి సాయినగర్ కాలనీ శివాజీ విగ్రహం సమీపం లోని బ్రైట్ నెస్ బ్యూటీ స్పా, శివాజీ విగ్రహం సమీపంలోని లవీ బ్యూటీ స్పా, అలకాపురి చౌరస్తా వద్ద హెచీఎఫ్సీ బ్యాంకు పైన ఉన్న శ్రీ ఎలైట్ స్పా అండ్ సెలూన్, నాగోల్ క్రాస్ రోడ్డు సమీపంలోని వేరీజోన్ స్పా కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే, ఆ సెంటర్లలో రికార్డులు లేక, గదుల్లో మసాజ్ చేయడం,సీసీ కెమెరాలు ఏర్పాటు సక్రమంగా లేక పోవటం, క్రాస్ మసాజ్ చేయడం ,సరైన ధ్రువీకరణ పత్రాలు లేకుండా కేంద్రాలు నిర్వహణను గుర్తించి కేసులు నమోదు చేయడం చైతన్యపూరి పోలీసుల తీరుకు ఈ ప్రాంత ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని వ్యక్తం అవుతుంది.

Police raids on spa centers

More articles

Latest article