నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో జిల్లా మహిళా, పురుషుల క్రీడాకారుల ఎంపికలను జిల్లా క్రీడా మైదానంలో నిర్వహించారు. ఎంపికలకు ఉమ్మడి జిల్లాల నుండి క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ ఎంపికలకు ముఖ్యఅతిథిగా జిల్లా డీవైఎస్ఓ పవన్ కుమార్ హాజరయ్యారు. . పవన్ కుమార్ మాట్లాడుతూ తాను కూడా మొదట బాల్ బ్యాట్మెంటన్ క్రీడాకారున్నని,బాల్ బ్యాట్మెంటన్ క్రీడలో ఎన్నో పథకాలు సాధించానాని తెలిపారు. క్రీడాకారులు జరగబోయే రాష్ట్ర స్థాయి క్రీడల్లో మంచి ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులకు తెలిపారు. జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం ప్రధాన కార్యదర్శి శ్యామ్ మాట్లాడుతూ బాల్ బ్యాడ్మింటన్ క్రీడకు పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా జిల్లా సంఘం కృషి చేస్తుందని అన్నారు. రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో పథకాలు సాధిస్తుందని, జిల్లా క్రీడా మైదానంలో బాల్ బ్యాడ్మింటన్ కోర్టుకు స్థలాన్ని కేటాయించాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారిని కోరారు. జిల్లా సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన డివైస్ఓ పవన్ ని శాలువతో సన్మానించారు. ఎంపికైన క్రీడాకారులకు శిక్షణ శిబిరాన్ని నిర్వహించి తుది జట్టును ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 22 నుండి 24 వరకు గోలేటి ,కొమరం భీమా ఆసిఫాబాద్ జిల్లాలో జరిగే 71వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సీనియర్ మహిళా, పురుషుల బాల్ బ్యాట్మెంటన్ క్రీడా పోటీలకు జిల్లా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తారు.
రాష్ట్ర స్థాయి సీనియర్ బాల్ బ్యాట్మింటన్ పోటీలకు ఉమ్మడి జిల్లా జట్ల ఎంపిక
