- డిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.సోమయ్య, టి.లింగారెడ్డి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.సోమయ్య, ప్రధాన కార్యదర్శి టి. లింగారెడ్డి లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(డిటిఎఫ్) 15 వ వార్షిక కౌన్సిల్ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సోమయ్య అధ్యక్షతన హైదరాబాద్ లోని టి. ఎన్.జి. ఓ భవనంలో జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి హాజరైన కౌన్సిల్ సభ్యులను ఉద్దేశించి సోమయ్య, లింగారెడ్డి లు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు అన్నింటిని సెమిరెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చి,విద్యార్థులందరికీ ఉదయం అల్పాహారం, పుష్టికరమైన మధ్యాహ్నబోజనం,సాయంత్రం స్నాక్స్ పాలు ఇచ్చి పాఠశాలలోనే హోంవర్క్ చేపించిన అనంతరం విద్యార్థులను ఇంటికి పంపే విధానం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని కోరారు.అప్పుడు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలు మనుగడ సాగించే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రధాన స్రవంతి ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేస్తూ,వాటికి బదులు గత ప్రభుత్వం కులాల వారిగా, మతాలవారీగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసినట్లే, ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్ల పేరిట నూతన పాఠశాలల ఏర్పాటు సరికాదని,ఈ చర్యల ద్వారా సామాజిక,ఆర్థిక అసమానతలు మరింత పెరిగే అవకాశం ఉంటుందన్నారు.కావున అంతరాలను పెంచే వివిధ రకాల పాఠశాలలను కాకుండా అందరూ విద్యార్థులు కలసి చదువుకునే ఒకే రకమైన పాఠశాలలు ఏర్పాటు చేసి అందరికీ సమాన అవకాశాలు గల నాణ్యమైన విద్య అందించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు,ఉపాధ్యాయులకు రావలసిన ఐదు డి .ఎ.లు వెంటనే విడుదల చేయాలని, 01.07.2023 నుండి అమలయ్యే విధంగా పీఆర్సీ 40% ఫిట్మెంట్ తో అమలు చేయాలని,నెలల తరబడి పెండింగ్ లో ఉంటున్న ఆర్థిక బిల్లులు,పెన్షనరీ బెనిఫిట్స్ విడుదల చేయాలని,ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించి ఖాళీగా ఉన్న, డిఇఓ ,డిప్యూటీ డిఇఓ,ఎంఈఓ, డైట్ లెక్చరర్స్ పోస్టులు వెంటనే భర్తీ చేసి పర్యవేక్షణ వ్యవస్థ పటిష్టం చేయాలని కోరారు. కోర్టు కేసులను అధిగమించి ఉపాధ్యాయుల ప్రమోషన్లు,బదిలీల ప్రక్రియ వెంటనే చేపట్టాలని, కేజిబీవీ ఉపాధ్యాయులకు మరియు ఇతర ఎస్ ఎస్ ఏ ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్ వర్తింపజేయాలని,29 రోజుల సమ్మె కాలానికి వేతనం చెల్లించాలని, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 పద్దు కింద వేతనాలు చెల్లించాలని,గురుకుల,ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో డిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. శo తన్, వి. రాజిరెడ్డి,టి. శ్రీశైలం,వి.రేణుక,చాప బాబుదొర,రాష్ట్ర కార్యదర్శులు ఎం.సామ్యూల్,ఎస్.భాస్కర్,జె.రామస్వామి, ఎ.శ్రీనివాస్ రెడ్డి,బి.శ్యామ్,రాష్ట్ర పూర్వ అధ్యక్షులు ఎం.రఘుశంకర్ రెడ్డి,రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి ఎం. ఎన్.కిష్టప్ప,ఆడిట్ కమిటీ కన్వీనర్ పి. ఈశ్వర్ రెడ్డి,సభ్యులు సీహెచ్ వెంకటేశ్వర్లు,బి.సదానందం,అధ్యాపక జ్వాల సంపాదకులు జి.కళావతి,పి.సుదర్శన్ రెడ్డి,అకడమిక్ సెల్ కన్వీనర్ బి.రామకృష్ణ,సభ్యులు ఇప్ప రాంరెడ్డి రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు,రాష్ట్ర కౌన్సిలర్లు పాల్గొన్నారు.

