ప్రభుత్వ పాఠశాలలను సెమిరెసిడెన్షియల్స్ గా మార్చాలి

డిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.సోమయ్య, టి.లింగారెడ్డి   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్  రాష్ట్ర అధ్యక్షులు ఎం.సోమయ్య, ప్రధాన కార్యదర్శి టి. లింగారెడ్డి లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(డిటిఎఫ్) 15 వ వార్షిక కౌన్సిల్ సమావేశం  రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సోమయ్య  అధ్యక్షతన హైదరాబాద్ లోని టి. ఎన్.జి. ఓ భవనంలో జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి...