26.2 C
Hyderabad
Monday, August 3, 2026

అనిశెట్టి రజితకు అక్షర నివాళి

Must read

📰 Generate e-Paper Clip

  • నెలకొరిగిన ఓ మహా వృక్షం
  • కవి కంకణాల రాజేశ్వర్

 

భీమ్ గల్, బతుకమ్మ: వరంగల్ జిల్లాకు చెందిన సుప్రసిద్ధ రచయిత్రి, కవయిత్రి, ప్రజాస్వామ్య రచయిత్రుల వేదిక జాతీయ అధ్యక్షురాలు, మహా యోధురాలు అనిశెట్టి రజిత ఆకస్మిక మృతి రచయితల లోకానికి తీరని లోటని కవి, చరిత్రకారుడు కంకణాల రాజేశ్వర్ అన్నారు. మంగళవారం పట్టణ కేంద్రంలో ఆమె శ్రద్ధాంజలి సభను నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులార్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తో మాట్లాడుతూ అనిశెట్టి రజిత(67)  ఆగస్టు 11, సోమవారం రాత్రి ఆకస్మికంగా గుండెపోటుతో పరమపదించారని ఆయన అన్నారు. బహుజన వాది, ఆర్గనైజర్, మహిళా వాది, వామపక్ష భావజాలంలో వికసించిన చేయి తిరిగిన సృజన శీలి, క్రమశిక్షణ కలిగిన తెలంగాణ సాహిత్య ఉద్యమ యోధురాలు, మేధావి, సంకలనకర్త, సహృదయ సౌజన్యశీలి, సాహితీవేత్తలకు ఆదర్శ నమూనా, నిరంతర సాహిత్య జీవి, తెలంగాణ రచయితల వేదికలో చురుకైన పాత్ర పోషించిన క్రియాశీలురు, ఉద్యమకారిణి. ప్రజా గాయని, సాహిత్య విమర్శకులు, అనిశెట్టి రజిత అన్నారు. అనిశెట్టి రజిత అకాల మరణం తెలంగాణ తెలుగు సాహిత్య లోకానికి తీరని లోటని,  పెండ్లి చేసుకోకుండానే తమ బ్రతుకంతా ఒడవని యుద్ధంలా సాగించిందని అన్నారు. ఆమె చైతన్యం ఎందరికో స్ఫూర్తని,  ఈ సమాజ విముక్తే ధ్యేయంగా మాతా సావిత్రిబాయి బాటలోఆమె నడిచిందన్నారు. ఒక ధిక్కార గొంతుకను కోల్పోయామని, అనిశెట్టి రజిత మరణం తో తెలంగాణ సాహితీ లోకం లో విషాదంలో నెలకొందన్నారు. చరిత్ర నిర్మాత, నిత్య చైతన్య శీలి, ఉద్యమ నిర్మాణం తప్ప అనిశెట్టి రజితకు వ్యక్తిగత జీవితం అంటూ వేరే లేదని, తమ జీవితాన్ని సామాజిక, సాహిత్య ఉద్యమాలకు అంకితం చేసిందన్నారు.ఏ మీటింగ్ కు వెళ్లినా వెంట కెమెరా తెచ్చుకొని ఆ వార్తలను అందరికీ స్ఫూర్తిదాయకంగా అందించేదని,  బహుజన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల మహిళా ఉద్యమాలలో సావిత్రిబాయి ఫూలే వారసత్వాన్ని కొనసాగించిందన్నారు. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమంలో కాళోజీ, ప్రొఫెసర్ జయశంకర్ ల ప్రోత్సాహంతో అనేక బహిరంగ సభల్లో తన ఉపన్యాసాలతో ప్రజలను ఉద్యమం వైపు ఆకర్షితులయ్యేలా ఉపన్యసించారన్నారు. అనిశెట్టి రజిత వరంగల్ జిల్లాలో 1958 ఏప్రిల్ 14వ తేదీన జన్మించారని, వరంగల్ అర్బన్ జిల్లా హనుమకొండ లోని కుమార్ పల్లి ప్రాంతానికి చెందిన రజిత వృత్తిరీత్యా కాకతీయ విశ్వవిద్యాలయంలో వివిధ హోదాల్లో బోధనేతర రంగంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహించి పదవీ విరమణ చేసి, విశ్రాంత జీవితం గడిపారన్నారు. 1973లో “చైతన్యం పడగె త్తింది” అనే తొలి రచనతో రజిత తన సాహిత్య జీవితానికి శ్రీకారం చుట్టారని,  2013లో స్త్రీలపై అత్యాచారాలపై నిరసనగా వీరి సంపాదకత్వంలో “ఉద్విగ్న” అనే సంకలనం ప్రచురించారన్నారు. 1969లో కాజీపేటలోని ఫాతిమా నగర్ పాఠశాలలో 9 వ తరగతి చదువుతున్న సమయంలో ప్రజా కవి కాళోజీ  ధిక్కారస్వర వారసత్వాన్ని అందిపుచ్చుకొని తెలంగాణ తొలి దశ ఉద్యమంలో పాల్గొందని,హనుమకొండలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి తెలంగాణ ఏర్పాటుపై తనకున్న మక్కువను చాటిందన్నారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రోత్సాహంతో మలిదశ ఉద్యమంలో పాల్గొని అనేక బహిరంగ సభల్లో తమ ఉపన్యాసాలతో ప్రజలను ఉద్యమం వైపు ఆకర్షితులు అయ్యేలా చేసిందని. మహిళా సమానత్వం, స్త్రీ విముక్తి కోసం అనేక రచనలు చేసిందన్నారు. దాదాపు ఇప్పటివరకు 500 కు పైగా కవితలు, 100కు పైగా వ్యాసాలు, 30కి పైగా దీర్ఘ కవితలు, 30కి పైగా పాటలు రాసి పాడిందన్నారు. ఈ కార్యక్రమంలో పిట్టల సందీప్ (నిర్మల్), జంగల నరేందర్ (రామన్నపేట్), వేంపల్లి చంద్రశేఖర్ గౌడ్ (సీతారాం పల్లె), కేశపురం సుమన్ (వెంకటాపూర్), కండక్టర్ నర్సయ్య (వేల్పూర్), కొరవి గోపరాజు సాహిత్య సాంస్కృతిక సంస్థ కార్యవర్గ సభ్యులు, సాహిత్య అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article