28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రజా సంక్షేమమే బీజేపీ నినాదం

Must read

📰 Generate e-Paper Clip

  • మండలానికి రూ. 8లక్షల ఎంపీ లార్డ్స్
  • అద్భుత అభివృద్ధి పనులు చేస్తున్న ఎం. పీ అరవింద్
  • మండల బీజేపీ ప్రెసిడెంట్ అరే రవీందర్

 

భీమ్ గల్, బతుకమ్మ : జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయించి పార్లమెంట్ పరిధిలో ఆర్ ఓ బి లు, బ్రిడ్జ్ లు మరెన్నో అభివృద్ది పనులను చేసిన ఎం. పీ అరవింద్ భీమ్ గల్ మండలానికి తన ఎం. పి లాడ్స్ నుండి రూ. 8లక్షల నిధులు కేటాయించారని మండల బీజేపీ ప్రెసిడెంట్ అరే రవీందర్ తెలిపారు. ఈ మేరకు మండల కేంద్రంలో ఎల్. జె ఫంక్షన్ హాల్ లో ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సందర్బంగా రవీందర్ మాట్లాడుతూ మండలంలోని ముచ్కూర్ లో శ్రీరామాలయ కమ్యూనిటీ హల్ నిర్మాణానికి రూ. 4లక్షలు, రహత్ నగర్ గ్రామంలో బస్సు సెల్టార్ నిర్మాణానికి రూ. 4లక్షలు నిధులను కేటాయించడం జరిగిందన్నారు. పార్లమెంట్ పరిధిలో రూ. 3 కోట్ల ఎం. పీ లాడ్స్ నిధులతో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. మండలానికి ఇట్టి ఎం. పీ లాడ్స్ నిధుల మంజూరు కి కృషి చేసినటువంటి బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి కి మండల బిజెపి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలిపారు.మంజూరు ఇచ్చిన నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మండల ప్రజల  అభివృద్ధి కోసం బిజెపి పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. కొందరు ప్రతిపక్ష పార్టీల చోటా, మోట నాయకులు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న నాయకులు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని, ఎంపీ అరవింద్ పై బురద జల్లుతు రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన అరవింద్ ఏం చేశాడని అబద్దాలు చెబుతున్నారని అన్నారు. అరవింద్  పార్లమెంటు పరిధిలో అద్భుతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు గతంలో ఏ ఎంపీ చేయని రైల్వే ఓవర్ బ్రిడ్జిలు కావచ్చు,  అసాధ్యమైన జాతీయ పసుపు బోర్డు తీసుకొచ్చి బోర్డు కార్యాలయం నిజామాబాద్ గడ్డపైన ఏర్పాటు చేయించిన ఘనత వారికే దక్కుతుందన్నారు.అలాగే ప్రతి సంవత్సరం ఎంపీ లార్డ్స్ నుంచి అనేక నిధులు తీసుకొచ్చి అభివృద్ధిలో పాల్పంచుకుంటున్నారని భీమ్ గల్ మండలంలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు వారు చేశారని ,భవిష్యత్తులో కూడా ప్రజా సంక్షేమమే భారతీయ జనతా పార్టీ నినాదంగా మరిన్ని నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయనున్నారని అన్నారు. ప్రతిపక్షాలకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు మరోసారి అరవింద్ ఏం చేశారు అనే మాట మాట్లాడితే ఊరుకునేది లేదని రవీందర్ హెచ్చరించారు. ఈ ప్రెస్ మీట్ లో కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు తోట గంగాధర్,ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు బండారి లక్ష్మణ్ గౌడ్,మండల ఉపాధ్యక్షులు భుఖ్య మోహన్, ఎస్టీ సెల్ మండల ఉపాధ్యక్షులు రమావత్ వెంకటేష్, బీజేవైఎం నాయకులు శెట్టి ప్రేమ్ చంద్ కుండల అన్వేష్, భూక్య నరేష్, కరిపే ప్రదీప్,మంగ్యనాయక్,అభిలాష్ పాల్గొన్నారు.

More articles

Latest article