26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ఉమ్మడి జిల్లాలో పోడు లొల్లి

Must read

📰 Generate e-Paper Clip

  • పంటల సాగు చేసిన తరువాత ధ్వంసం చేస్తున్న ఆటవీ శాఖ
  • పోడు రైతుల ఆత్మహత్యాయత్నాలు
  • ప్రభుత్వ హామీకి తూట్లు పొడుస్తున్న ఫారెస్ట్ అధికారులు
  • పోడు రైతుల ఆందోళనలు ఉద్రిక్తం

 

నిజామాబాద్, బతుకమ్మ : ఉమ్మడి జిల్లాలో మాచారెడ్డి మండల శివారు, అక్కాపూర్ శివారులో దశాబ్దాలుగా పంటలు సాగు చేసుకుంటున్న భూముల్లో అటవీ శాఖాధికారులు జేసీబీలతో కందకాలు తవ్వి అక్కడ ఉన్న పంట పొలాలను ధ్వంసం చేశారు. తమ తాతల నుంచి సాగు చేసుకుంటున్న భూమిలో తవ్వకాలు చేయడంతో పాటు రైతులపై కేసులు నమోదు చేయడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో తాము అక్కడ సాగు చేస్తున్నట్లు రికార్డులు ఉన్నాయన్నారు. కొత్త ప్రభుత్వం పోడు పట్టాలు ఇస్తారని ఆశగా ఎదురు చూస్తుంటే అటవీ శాఖాధికారులు ధ్వంద ప్రమాణాలతో పంటలను సాగు చేయకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధారి మండలం సీతాయిపల్లి శివారులో అటవీ భూములోకి వచ్చి సాగు చేస్తున్నారని మొక్కజొన్నపై అటవీ శాఖాధికారులు గడ్డిమందు పిచికారి చేయడంతో రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇటీవల మోపాల్ మండలంలోని బైరాపూర్ శివారులో రైతు సాగు చేస్తున్న భూమిలోనూ పంటలు సాగు చేస్తున్నారని గడ్డి మందు పిచికారి చేయడంతో రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు.

The joint district is a mess

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో మళ్లీ పోడు భూముల లొల్లి మొదలైంది.  తాతల కాలం నుంచి (దశబ్దాలుగా) భూములను సాగు చేసుకుంటున్నామని వాటిలో పంటల సాగును ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారని పోడురైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని చాలా మండలాల్లోని పోడు భూముల వివాదాలు గత కొన్నేళ్లుగా కొనసాగుతున్నాయి. అటవీ శాఖ అధికారులు తమ పరిధిలోని భూములు సాగు చేయొద్దని పోడుదారులను ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడంతో ఈ వివాదాలు తలెత్తుతున్నాయి. తమకు సాగుకు అడ్డుకుంటే ఆత్మహత్య ల యత్నాలు జరుగడం కలకలం రేపుతోంది. ఉమ్మడి జిల్లాలో  మాచారెడ్డి, సిరికొండ, మోపాల్ లింగం పేట్, దర్ పల్లి మండలాల్లో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోడు పట్టాలు ఇస్తామని ఎన్నికల హామీ అమలు సంగతి దేవుడెరుగు కానీ ఏకంగా భూముల్లో నుంచి రైతులను వెళ్లగొట్టేందుకు అటవీ అధికారులు బలప్రయోగం చేయడం ప్రభుత్వంపై రైతుల్లో, గిరిజనుల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందని చెప్పాలి.

The joint district is a mess

ఉమ్మడి జిల్లాలో అటవి ప్రాంతంలో పోడు భూముల్లో సాగు దశాబ్ధాలుగా సాగుతుంది. గత ప్రభుత్వ హయంలోనూ రైతులకు పోడు పట్టాలను పంపిణీ చేశారు. గత ఎన్నికలకు ముందు నిజామాబాద్ జిల్లాలో పాదయాత్ర చేసిన ఆనాటి ప్రతిపక్ష నేత, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు పోడు పట్టాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల ధరణి స్థానంలో భూభారతి పోర్టల్ తెచ్చిన ప్రభుత్వం పట్టాల పంపిణీకి సిద్దమైంది. దాని కోసం గ్రామాలలో సదస్సులను నిర్వహిస్తుండగా రికార్డుల సంగతి పట్టించుకోకుండా రైతులను అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు వికటిస్తున్నాయి. పోడు పట్టాల కోసం అటవి శాఖాధికారులు పోజిషన్ సర్టిఫికెట్ల జారీకి డబ్బులు వసూల్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సిరికొండ, ఎల్లారెడ్డి, ఫారెస్టు రేంజ్ అధికారులు సస్పెన్షన్ తో ఈ వ్యవహరం వెలుగు చూసింది. ఇటీవల జరుగుతున్న ఆందోళనలోనూ గిరిజనులు, గిరిజనేతరులు ఇవే ఆరోపణలు చేస్తున్నారు. ప్రధానంగా పోడు పట్టాల పంపిణీ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు అటవి అధికారులు తీసుకుంటున్న చర్యలు ప్రజల్లో ప్రధానంగా రైతుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ విషయంపై అధికార యంత్రాంగాలు జోక్యం చేసుకోవాలని రైతులు ప్రజావాణిలోనూ, ఏకంగా హైదరాబాద్ లో ఫిర్యాదులకు సిద్దమౌతున్నారు. ఇటీవల జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క సైతం పోడు పట్టాలు ఇస్తామని చెబుతున్నప్పటికీ అటవి శాఖాధికారుల తీరుమాత్రం వివాదాస్పదంగా మారుతుంది.

The joint district is a mess

More articles

Latest article