డిచ్ పల్లి, బతుకమ్మ : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ పండుగను పురస్కరించుకొని డిచ్పల్లి లోని వివేకానంద పాఠశాలలో రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు బి.శివ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్షాబంధన్ పండుగ విశిష్టత గురించి చెప్పారు. విద్యార్థులలో సోదర సోదరీమణి భావం, కులమత భేదం లేకుండా విద్యార్థుల్లో ఐక్యత భావం కోసం, సమాజం పట్ల మనమంతా ఒకటే కుటుంబం అనే భావం పెంపొందించడానికి మన సాంస్కృతి తెలియజేయడానికై విద్యార్థిని విద్యార్థులకు రక్షాబంధన్ పండుగ యొక్క విశిష్టతను తెలియజేసి ఈ రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. ఏ విద్యార్థికి ఆపద వచ్చిన అందరం కలిసి మెలిసి పోరాడాలని అన్నాచెల్లె అక్క తమ్ముడు అనే సోదర భావంతో మెలగాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివేకానంద పాఠశాల ప్రిన్సిపల్ సాయిలు, యూనివర్సిటీ ఉపాధ్యక్షులు అజయ్, మనోజ్, యూనివర్సిటీ నాయకులు మహర్షి, అజేందర్ పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

