ఏబీవీపీ డిచ్ పల్లి శాఖ ఆధ్వర్యంలో రక్షాబంధన్
డిచ్ పల్లి, బతుకమ్మ : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ పండుగను పురస్కరించుకొని డిచ్పల్లి లోని వివేకానంద పాఠశాలలో రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు బి.శివ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్షాబంధన్ పండుగ విశిష్టత గురించి చెప్పారు. విద్యార్థులలో సోదర సోదరీమణి భావం, కులమత భేదం లేకుండా విద్యార్థుల్లో ఐక్యత భావం కోసం, సమాజం పట్ల మనమంతా ఒకటే కుటుంబం అనే భావం పెంపొందించడానికి మన సాంస్కృతి తెలియజేయడానికై విద్యార్థిని విద్యార్థులకు...