25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

అర్హత లేని డ్రైవర్ తో స్కూల్ బస్ నడిపిస్తున్న వైనం

Must read

📰 Generate e-Paper Clip

  • ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న మాస్టర్ మైండ్ స్కూల్ నిర్వాహకులు
  • అజాగ్రత్తగా స్కూల్ బస్సు నడిపిన డ్రైవరును అడ్డుకున్న బిజెపి నాయకులు
  • సంబంధిత ఆర్టీవో, విద్యాధికారికి ఫిర్యాదు చేసిన బీజేపీ నాయకులు

 

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో  మాస్టర్ మైండ్స్ స్కూల్ యాజమాన్యం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ అర్హత లేని వ్యక్తితో స్కూల్ బస్సును నడిపిస్తున్నారని అదేంటని ప్రశ్నిస్తే దురుసుగా ప్రవర్తిస్తున్నారని బిజెపి నాయకులు గురువారం ఉదయం ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మాస్టర్ మైండ్ పాఠశాల యాజమాన్యం వారు అర్హతలేని బస్సు డ్రైవర్ ని డ్రైవర్ గా పెట్టుకొని పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అజాగ్రత్తగా బస్సును నడిపిస్తున్నాడని పాఠశాల యాజమాన్యాన్ని నిలదీసిన బిజెపి నాయకులు.దీంతో పాఠశాల యజమాన్యం నిర్లక్ష్యం సమాధానం చెప్పారని వారు తెలిపారు.. గొల్లపల్లి నుండి ఎల్లారెడ్డిపేట పాఠశాల వైపు వస్తున్న స్కూల్ బస్సులో విద్యార్థులు ఉన్నారని రోడ్డు వెంబడి రాష్ డ్రైవింగ్ చేస్తూ బస్సును కట్లు కొడుతూ నడిపిస్తు విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వారు తెలిపారు.. అర్హత లేని బస్సు డ్రైవర్ పెట్టుకొని విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మాస్టర్ మైండ్ పాఠశాల యజమాన్యం పై చర్యలు తీసుకోవాలని మండల విద్యాధికారికి, ఆర్టీవోకు వినతిపత్రం అందించడం జరిగిందని  బిజెపి నాయకులు తెలిపారు.. ఎంఈఓ పాఠశాలను సందర్శించి పూర్వపరాలను పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ మాలోత్ కిరణ్ నాయక్, బిజెపి మండల ప్రధాన కార్యదర్శులు నంది నరేష్, దాసరి గణేష్  తదితరులు ఉన్నారు.

More articles

Latest article