వెబ్ డెస్క్, బతుకమ్మ :
బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసిన రోజు ‘మండల్ డే( ఆగస్టు 7)న నిర్వహించే జాతీయ మహాసభలను ఈ ఏడాది గోవా రాష్ట్ర రాజధాని పనాజీలో గురువారం చాలా ఘనంగా నిర్వహించారు. ఈ జాతీయ మహాసభలో నిజామాబాద్ జిల్లా నుండి పెద్ద ఎత్తున దాదాపు 50 మంది బీసీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై గళం విప్పాల్సిందే ఇదే సరైన సమయం అన్నారు. ఇప్పుడు మన హక్కుల కొరకు పారాడక పోతే రాబోవు తరాలకు మనం అన్యాయం చేసిన వారిమి అవుతున్నారు. కులగణనను కేంద్రం వెంటనే ప్రారంభించి అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కొరకు చేసిన ఆర్డినెన్స్ ను ఆమోదించాలని డిమాండ్ చేశారు. జాతీయ ఓబీసీ మహాసభల్లో క్రమం తప్పకుండా గతం నుండి పాల్గొనడం గర్వంగా ఉందని జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీసీల రాజ్యాధికారం సాధిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆకుల ప్రసాద్, మాడవేడి వినోద్, నారాయణరెడ్డి పటేల్, దర్శనం దేవేందర్, కొయ్యాడ శంకర్, శ్రీలత,, చంద్రకాంత్, బగ్గల అజయ్, బసవరాజు, పల్లికొండ అన్నయ్య, కోడూరు స్వామి, మహేష్, నర్సయ్య, నాగరాజు, గోవర్ధన్, శ్రీనివాస్, జయ, అపర్ణ, బాబు, శేఖర్, గణేష్, విశాల్ తదితరులు పాల్గొన్నారు

