24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ఘోర ప్రమాదం.. 11 మంది మృతి

Must read

📰 Generate e-Paper Clip

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోండాలో ఘటన

వెబ్ న్యూస్, బతుకమ్మ : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈఘటనలో 11 మంది మృతి చెందారు.  గోండాలో  పృథ్వీనాథ్ ఆలయానికి భక్తులను తీసుకెళుతున్న బొలేరో వాహనం అదుపుతప్పి కాలువలో బోల్తా పడింది. పరాసరాయ్-ఆలవాల్ డియోర మార్గంలోని రేహారి గ్రామం సరయూ వంతెన వద్ద ఈఘటన చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 11 మంది మృతి చెందారు.  సరయూ నది నుంచి మృతదేహాలను వెలికితీసినట్లు పోలీసులు  వెల్లడించారు. ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం 15 మంది యాత్రికులు ఉన్నారు.  అందులో నలుగురు వ్యక్తులను స్థానికులు కాపాడారు. మృతి చెందిన వారిని మోతీ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిహాగావ్ వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు.

More articles

Latest article