- జర్నలిస్ట్, కవి, చరిత్రకారుడు కంకణాల రాజేశ్వర్
భీమ్ గల్, బతుకమ్మ : అధికారిక, అనాదికారిక కార్యక్రమాల సమాచారాన్ని దాదాపు అన్ని పత్రికలకు అందజేసేట్లు అధికారులు వ్యవహరించాలని చిన్న పత్రికలని చిన్న చూపు చూడకుండా అన్ని పత్రికను ఆధరించాలని జర్నలిస్ట్, కవి, చరిత్రకారుడు కంకణాల రాజేశ్వర్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారులు, నాయకులు కొన్ని తమకు అనుకూలమైన పత్రికల వారికే సమాచారం ఇచ్చి చేతులు దులుపుకోవడం సమంజసం కాదన్నారు.వార్తలో దమ్ముండాలే కానీ అది ఏ పత్రిక అనేది అవసరం లేదని, చిన్న పత్రికల్లో, ఈ -పేపర్లల్లో వచ్చిన వార్తలు సైతం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో స్క్రాప్ బుక్ లో పొందుపరచాలని ఆయన అన్నారు. తక్షణమే స్పందించి ఇట్టి విషయం పై విచారణ చేపట్టాలని ఆదేశించారు. పత్రికలకు సర్కులేషన్ మాత్రమే ముఖ్యం కాదని, అధికార పార్టీకి అనుకూలంగా వ్రాస్తేనే అది వార్త కాదని, వార్త వార్త లాగే ఉండాలన్నారు. పత్రిక ప్రమాణాలే వార్తలకు శ్వాస ఉండాలని, జర్నలిస్ట్ లను గౌరవించాలని జర్నలిస్టులు సైతం గౌరవింపబడేట్లు వ్యవహరించాలన్నారు. ఒక వార్త కొరకై కార్యాలయానికి వచ్చి సేకరించుకొని వెళ్లిన తర్వాత అట్టి జర్నలిస్ట్ పై నెగటివ్ గా మాట్లాడే అధికారులు మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు కోకొల్లలుగా ఉన్నారని. అట్లాంటి అధికారుల, నాయకుల తీరు మారాలని, తగిన విధంగా స్పందించాలని, చిన్న చూపుతో చూడరాదన్నారు. జర్నలిస్టుల భావజాల శక్తి యుక్తుల్ని బేరీజు వేసుకోవాలని, ఈ -పేపర్లను కూడా గౌరవించి ఆదరించాలని, చిన్న పత్రికలన్న, ఈ పేపర్లన్న కొన్ని కార్యాలయాలలో అధికారులు చులకన భావంతో చూస్తున్నారని అన్నారు.జిల్లాస్థాయిలో అధికారికంగా జరిగే కార్యక్రమాలు చూసే జిల్లా ప్రజా సంబంధాల అధికారి (డిపిఆర్ఓ) పక్షపాత ధోరణితో చూడకుండా పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన కోరారు.అలా కాకుండా రాష్ట్రంలో తగిన సమాచారం ఇవ్వని డిపిఆర్ఓ లు అక్కడక్కడా కొందరు ఉన్నారని, చులకన భావంతో చూసే అధికారులు చాలామంది ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.అట్లాంటి వారి తీరు మారాలని, ఒకరి పట్ల ఒకరు గౌరవ మర్యాదలతో మెదులుకోవాలని, గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖలా, అధికారులు, కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు చిన్న పత్రికల జర్నలిస్టులకు, ఈ పేపర్ ల జర్నలిస్టులకు సముచిత స్థానం కల్పించాలన్నారు. ప్రకటనలు సైతం అన్ని పత్రికలకు, ఈ పేపర్లకు కూడా ఇచ్చినట్లయితే సహకరించిన వారవుతారన్నారు.
