27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఢిల్లీ పోలీసులమని చెప్పి బంగారం అపహరణ

Must read

📰 Generate e-Paper Clip

బాల్కొండ, బతుకమ్మ : వివాహానికి వెళ్తున్న వారిని రోడ్డుపై ఆపి ఢిల్లీ పోలీసులమని చెప్పి నమ్మించి బంగారం అపహరించకపోయినా ఘటన గురువారం బాల్కొండ పరిధిలో జరిగిందని ఎస్సై శైలేందర్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం ముప్కాల్ నుండి పెరికిట్ కు పెళ్లికి వెళుతుండగా బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని  బాల్కొండ జాతీయ రహదారి 44 పైకి రాగానే గుర్తుతెలియని దుండగులు బైక్ పై ఇద్దరు పెండ్లికి వెళ్తున్న వారిని వెనుక నుండి బుల్లెట్ బండి పై వచ్చి ఢిల్లీ పోలీసులము అని చెప్పి ఆపి, దొంగతనాలు అవుతున్నాయి మెడలో బంగారాన్ని తీసి పర్సులో పెట్టుకోమని చెప్పగా అట్టి మహిళ వారు చెప్పిన మాటలు విని పర్సులో పెట్టుకోగా,   దృష్టి మరల్చి 7 తులాల  బంగారాన్ని ఎత్తుకెళ్లారు. బాధితురాలు కోప్పేల లింగవ్వ, లింగాపురం గంగా రెడ్డి ముప్కాల్  ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాల్కొండ ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

More articles

Latest article