బతుకమ్మ, కోటగిరి : కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బాన్స్ వాడ డివిజన్,కోటగిరి మండల మాల సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఎస్ సి. రిజర్వేషన్ లో రోస్టర్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి నాయకులు నిరాసన కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమం సందర్భంగా డివిజన్ మండల అధ్యక్షులు మీర్జాపూర్ సాయన్న దండు భూమేష్ మాట్లాడుతూ…. 2025 ఏప్రిల్ 14 న ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ జీవో నంబర్ 99 ద్వారా ఎస్సీలలో 3 గ్రూపులుగా విభజించి మాల సామాజిక వర్గం వర్గానికి ఐదు శాతం రిజర్వేషన్ కల్పించారన్నారు. రోస్టర్ పాయింట్ లో 22 న కేటాయించి మాల సామాజిక వర్గానికి విద్యారంగంలో ఉద్యోగ రంగంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే రోస్టర్ పాయింట్ విధానాన్ని ఉపసంహరించికోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు రోస్టర్ పాయింట్ విధానాన్ని ప్రోత్సహిస్తున్న నాయకులకు ప్రభుత్వాలకు గద్దె దింపే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. స్థానిక ఎన్నికల్లో మాల సంఘం నాయకులు ఓటు బ్యాంకు ద్వారా తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాన్స్ వాడ డివిజన్ అధ్యక్షులు మీర్జాపూర్ చిన్న సాయన్న డివిజన్ కార్యదర్శిలు బ్యాగరి రాములు, పుప్పల సైదయ్య, మోరే జీవన్ కోటగిరి మండల అధ్యక్షులు దండు భూమేష్ ఉపాధ్యక్షులు పాల గంగారం, కాలే సాయిలు ఎత్తోండ గంగాధర్, లక్ష్మణ్, విట్టల్,మారుతి, ఆవుల గంగారం, కిషన్, మొగులప్ప, ఉమ్మడి మండలాల వివిధ గ్రామాల మాల సంఘ అధ్యక్షులు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శిలు తదితరులు పాల్గొన్నారు.
