27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ఘనంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ జన్మదిన వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం  కామారెడ్డిలోని ఆయన నివాసం వద్ద జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకట్రాం రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ ఎమ్మెల్యే మదన్ మోహన్ తో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. శాలువా కప్పి, పూలగుచ్ఛం అందజేసి ఆయనకు మరింత శక్తి, ఆయురారోగ్యాలతో ప్రజల సేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. నాయకులతో పాటు పలువురు కార్యకర్తలు, అభిమానులు కూడా హాజరై పుట్టినరోజు వేడుకలను ఉత్సాహంగా జరిపారు. “జనహితే మానవ ధర్మం” అనే నినాదంతో ప్రజల మద్దతుతో ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ నాయకత్వం తెలంగాణకు ఆశాజ్యోతి” అంటూ నాయకులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ మాజీ చైర్మన్ బోండ్ల సాయిలు, మాజీ జెడ్పిటిసి సామెల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ గౌడ్, తిమ్మారెడ్డి మాజీ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, సొసైటీ డైరెక్టర్ సుఖేందర్ రెడ్డి తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.

MLA Madan Mohan's birthday celebrated with grandeur

More articles

Latest article