27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

శ్రీ చైతన్య పాఠశాలను వెంటనే సీజ్ చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

  • విద్యార్థి సంఘాల ధర్నా

 

బతుకమ్మ, బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలో ఎలాంటి అనుమతి లేకుండా నడుస్తున్న శ్రీ చైతన్య పాఠశాల ముందు గురువారం విద్యార్థి సంఘాలు అనుమతులు లేని పాఠశాలను విద్య శాఖ అధికారులు సీజ్ చేయాలని ధర్నా నిర్వహించరు.పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు ఎన్.బాల్ రాజ్ మాట్లాడుతూ విద్య శాఖ నుండి  అనుమతులు లేకుండా శ్రీ చైతన్య పాఠశాల నడిపిస్తూవున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఇన్ఛార్జిని మేడంని ప్రశ్నించగా శ్రీ చైతన్య పాఠశాల కాదని, కేవలం ట్యూషన్ సెంటర్ అని సమాధానం ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండా తరగతులు కొనసాగిస్తున్న శ్రీ చైతన్య పాఠశాలను తక్షణమే విద్యాశాఖ అధికారులు సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.విద్యార్థుల ఒక సంవత్సర కాలం భవిష్యత్ వృథా అవుతుందని చెప్పారు. ఇలాగే కొనసాగితే విద్యార్థి సంఘలు విద్యాశాఖ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ(ఎస్) జిల్లా అధ్యక్షుడు బాల్ రాజ్, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకుడు పుట్ట భాస్కర్, టీఎస్ పీ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్, సాయిబాబా, శివకుమార్, ఫాజిల్, అబ్దుల్ హాకీం, ప్రశాంత్, నిఖిల్, మేఘనాథ్, నవీన్, గణేష్, వేణు గౌడ్, రవీందర్ గౌడ్, మహేష్, జీవన్ పాల్గొన్నారు.

More articles

Latest article