26.3 C
Hyderabad
Monday, August 3, 2026

5న జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

మెండోరా, బతుకమ్మ : ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు షెడ్యూలు తక్షణమే విడుదల చేసి అమలు చేయాలని, పే రి విజన్ కమిషన్ రిపోర్ట్ తెప్పించుకొని పీఆర్సీ అమలు చేయాలని,  ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (USPC) స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 5న పాత కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నా ను విజయవంతం చేయాలనీ యూఎస్పీసీ జిల్లా స్టీరింగ్ కమిటీ నాయకులు ఓ.రమేష్,శ్రీనివాస్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మెండోరా మండలంలో పోచంపాడ్ లో ధర్నా పోస్టర్లను విడుదల చేసి అనంతరం వారు మాట్లాడుతూ మొత్తం ముప్పై డిమాండ్లు సాధన కొరకు మూడు దశల ఉద్యమ కార్యచరణ మొదలైందని మొదటి దశ మండల రెవెన్యూ అధికారుల ద్వారా ముఖ్యమంత్రికి వినతులను ఈనెల 23, 24 న మెమొరాండం లు సమర్పించామని, ఆగస్టు 23న చలో హైదరాబాద్ మహా ధర్నాను నిర్వహించనున్నామని తెలియజేస్తున్నాము. వివిధ జిల్లాలలో అర్హతలు లేని వారు డీఈవోలుగా పనిచేస్తున్నారని వారిని తక్షణమే తొలగించాలని అర్హతలు ఉన్న వారితో డీఈవోలుగా నియమించాలని, డిప్యూటీ డిఇఓ ఎంఈఓ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని, పర్యవేక్షణ వ్యవస్థను పటిష్టం చేయాలని, పెండింగ్లో ఉన్న ఐదు డి ఏ లలో తక్షణమే రెండు డీఎలు చెల్లించాలని నూతన మండలాలకు ఎంఈఓ పోస్టులను మంజూరు చేయాలని, ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని, ప్రాథమిక పాఠశాలలో ఉన్న కాళీ పోస్టులను డీఎస్సీ ద్వారా వెంటనే భర్తీ చేయాలని, ఏడాదిన్నరగా పెండింగ్ లో ఉన్న వివిధ రకాల బిల్లుల మంజూరు తక్షణమే చేపట్టాలని, 55 71 పిఎస్ హెచ్ఎం పోస్టులను మంజూరు చేయాలని, పండితుల అప్గ్రేడేషన్ ప్రక్రియ పూర్తి అయినందున జీవో 2,3,9,10 లను రద్దుచేసి 11,12 ల ప్రకారం పదోన్నతులు కల్పించాలని ఉపాధ్యాయుల సర్దుబాటు మార్గదర్శకాలను సవరించి అమలు చేయాలని వివిధ జిల్లాలలో జరిగిన అక్రమ డిప్యూటేషన్లను రద్దు చేయాలని, కేజీబీవీ మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని, సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె కాలపు వేతనాలు చెల్లించాలని, అన్ని ఉన్నత పాఠశాలలకు ప్రాథమికొన్నత పాఠశాలకు పీఈటీ పోస్టులు మంజూరు చేసి భర్తీ చేయాలని, మోడల్ స్కూల్ గురుకుల విద్యాలయాల ఉపాధ్యాయులకు 010 ద్వారా  వేతనాలు చెల్లించాలని, మొదలైన సమస్యల పరిష్కారం కొరకు ఆగస్టు 5వ తేదీన పాత కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టనున్న యుఎస్పిసి ధర్నాకు అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు హాజరై విజయవంతం చేయాలనీ కోరారు. ఈకార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్,ధర్మపురి,దేవసహాయం శ్రీనివాస్ ప్రభాకర్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article